Harish Rao: మోటారు కావాలా..? మీటరు కావాలా..? మునుగోడు ప్రజలు ఆలోచించాలి

Harish Rao: ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవ పరీక్ష

Jyothi
Updated on: 9 Oct 2022 3:20 PM IST
Harish Rao Said that is a Test of the Munugode Peoples Self Respect
X

Harish Rao: మోటారు కావాలా..? మీటరు కావాలా..? మునుగోడు ప్రజలు ఆలోచించాలి

Harish Rao: మోటారు కావాలో.. మీటరు కావాలో.. మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు మంత్రి హరీష్‌రావు. ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవ పరీక్ష అని, 8ఏళ్లలో రాష్ట్రానికి టీఆర్‌ఎస్‌ ఏం చేసింది, దేశానికి కేంద్రం ఏం చేసిందనేది ప్రజల ముందే ఉందన్నారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలావాలా..? లేక రాజగోపాల్‌రెడ్డి ధనం గెలవాలా..? అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పారు మంత్రి హరీష్‌రావు.

మునుగోడులో బీజేపీ దొడ్డిదారిలో గెలిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు మంత్రి హరీ‌ష్‌రావు. వివిధ రాజకీయ పార్టీల నేతలను, కార్యకర్తలను డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇంతేకాదు.. కార్లు, బైక్‌లు ఇచ్చి తమవైపు తిప్పుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. కోట్లు పంచిపెట్టి ప్రజలను బీజేపీ కొనాలని చూస్తోందంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి హరీష్‌.

Jyothi

Jyothi

Next Story