Harish Rao: క్రైస్తవుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి మంత్రి హరీశ్ భరోసా

Harish Rao Said for the Welfare of Christians and Solving Problems
x

Harish Rao: క్రైస్తవుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి మంత్రి హరీశ్ భరోసా

Highlights

Harish Rao: చర్చిల నిర్మాణానికి, సమాధులకోసం స్థలాలు కేటాయిస్తాం

Harish Rao: క్రైస్తవులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎల్.బి.స్టేడియంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అధ్యక్షతన క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 6వ నేషనల్ ప్రేయర్ డే నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల ప్రజలను ఒకే తల్లి పిల్లలుగా చూస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు.

ఏసుక్రీస్తు దీవెనలతో సీఎం కేసీఆర్ సారధ్యంలో దేశంలోనే తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతోందన్నారు. క్రిస్మను రెండు రోజుల పాటు అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దక్కిందన్నారు. రాష్ట్రంలో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని, క్రిస్టియన్ సమాధుల కోసం అన్ని జిల్లాలో ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories