Harish Rao: MBBS, PG సీట్లలో జనాభా ప్రాతిపదిక దేశంలోనే మొదటి స్థానం

Harish Rao Released Report of Medical Health Department of Telangana
x

Harish Rao: MBBS, PG సీట్లలో జనాభా ప్రాతిపదిక దేశంలోనే మొదటి స్థానం

Highlights

Harish Rao: ఉమ్మడి ఏపీలో 3 మెడికల్‌ కాలేజీలు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత 8 మెడికల్‌ కాలేజీలు

Harish Rao: హైదరాబాద్‌లోని MCHRDలో వైద్య ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికను విడుదల చేశారు మంత్రి హరీష్‌రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌ గత బడ్జెట్‌లో 11వేల కోట్లకు పైగా నిధులు వైద్యశాఖకు కేటాయించారని తెలిపారు. గతేడాది ఒకట్రెండు ఘటనలు ఎంతగానో బాధించాయని.. మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సరిచేసుకున్నామన్నారు. 2022ను వైద్యశాఖకు లిఖించదగిన ఏడాదిగా చెప్పుకుంటామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 3 మెడికల్‌ కాలేజీలు వస్తే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 8 మెడికల్‌ కాలేజీలు వచ్చాయన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2 వందలకు పైగా పీజీ సీట్లు 2022లో తెచ్చుకున్నామని తెలిపారు. MBBS, PG సీట్లలో జనాభా ప్రాతిపదిక దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు మంత్రి హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories