Harish Rao: తెలంగాణలో ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం.. ఈ ఘనత సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం

Harish Rao Praises On CM KCR After 9 Medical Colleges Inauguration
x

Harish Rao: తెలంగాణలో ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం.. ఈ ఘనత సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం

Highlights

Harish Rao: ఈ ఏడాది మన రికార్డును మనమే అధిగమించాం

Harish Rao: తెలంగాణలో ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి అని అన్నారు మంత్రి హరీష్‌రావు. ఈ ఘనత సీఎం కేసిఆర్ పట్టుదలకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని ఆయన మార్గ నిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించామన్నారు. గత సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించిందని.. ఈ సంవత్సరం మన రికార్డును మనమే అధిగమించామన్నారు.

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం అన్నారు. దేశంలోని మిగితా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories