Harish Rao: ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి విప‌క్షాల‌కు ఇవ్వ‌డం ఆన‌వాయితీ

Harish Rao Oppose Arekapudi Gandhi Appointed As PAC Chairmen
x

Harish Rao: ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి విప‌క్షాల‌కు ఇవ్వ‌డం ఆన‌వాయితీ

Highlights

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ అని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఖూనీ చేసిందన్నారు. అరికెపూడి గాంధీని కాంగ్రెస్‌లో జాయిన్ చేసుకుని.. అతనికి ఎలా ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని హరీష్‌ రావు అసహనం వ్యక్తం చేశారు.

కాగా అసెంబ్లీలో మూడు కమిటీలను అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా అరికెపూడి గాంధీ.. అంచనాల కమిటీ ఛైర్‌ పర్సన్‌గా ఉత్తమ్ పద్మావతి రెడ్డిని.. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటి ఛైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే కే. శంకరయ్యను నియమిస్తూ కార్యదర్శి నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories