Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి.. ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు హరీష్ రావు బహిరంగ లేఖ..

Harish Rao Open Letter To Mallikarjun Kharge
x

సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి.. ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు హరీష్ రావు బహిరంగ లేఖ..

Highlights

Harish Rao: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు హరీష్‌రావు లేఖ రాశారు.

Harish Rao: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు హరీష్‌రావు లేఖ రాశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ వాడుతున్న భాషపై అభ్యంతరం తెలిపారు. రేవంత్‌ వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్‌ది ద్వంద్వ నీతి అని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌పై రేవంత్‌ దూషణలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

రాహుల్‌గాంధీపై బీజేపీ తీవ్రవాది వ్యాఖ్యలను ఖండించామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రవర్తన దుర్యోధనుడి క్రూరత్వంలా ఉందన్నారు. కేసీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపాలి అనే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్‌ హైకమాండ్‌ సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్న రాహుల్‌ ఎందుకు స్పందించరని అన్నారు.

బీఆర్‌ఎస్‌ నాయకులపై కక్షసాధింపుగా కేసులు పెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. రేవంత్‌ అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని హరీష్‌‌రావు డిమాండ్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories