మొదటి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

మొదటి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
x
Highlights

జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మొదటి పురపాలక సంఘం సర్వ సభ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

మెదక్: జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మొదటి పురపాలక సంఘం సర్వ సభ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, ఛైర్మన్ చంద్రపాల్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని 32 వార్డులలో కౌన్సిలర్లు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... పట్టణంలో చాలా చోట్ల సమస్యలు ఉన్నాయని, వాటిని తీర్చడం జరుగుతుందని ఆయన అన్నారు.

మెదక్ మున్సిపాలిటీ భవనంలో సమావేశ మందిరం లేకపోవడం మూలంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమావేశం ఏర్పాటు చేయడం కోసం 20 లక్షల రూపాయలతో మున్సిపల్ పైన సమావేశంలో తీర్మానించడం జరిగింది. అలాగే 32 వార్డులలో పారిశుద్ధ్య పనులు చెయ్యడం సరిపడే సిబ్బంది లేకపోవడం మూలంగా, మూడు నెలలకు 50 మంది పారిశుద్ధ్య సిబ్బంది తీసుకోవడం జరుగుతుందని, దీని కోసం 13 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మెదక్ పట్టణానికి సరఫరా మంచి ఇక్కడ పైపులైను చెడిపోవడంతో, 5 లక్షల రూపాయలు ఖర్చు దీనికోసం వెంటనే 5 లక్షల రూపాయలతో పైపులైను పట్టణంలోని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories