Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హరీష్‌రావుకు ఊరట

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హరీష్‌రావుకు ఊరట
x
Highlights

Phone Tapping Case: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, రిటైర్డ్ పోలీస్ అధికారి రాధాకిషన్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

Phone Tapping Case: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, రిటైర్డ్ పోలీస్ అధికారి రాధాకిషన్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన పోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది. సిద్దిపేటకు చెందిన వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోహరీశ్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 2024 డిసెంబర్ 3న హరీశ్ రావుతో పాటు అప్పట్లో ఇంటలిజెన్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావుపై ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని కూడా ఆయన అప్పట్లో చెప్పారు. తన వద్ద ఆధారాలను కూడా పోలీసులకు అందించారు. ఈ కేసుపై హరీశ్ రావు గతంలోనే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని 2024, డిసెంబర్ 5న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories