Harish Rao: ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

Harish Rao Congratulated The People On The Festival Of Sankranti
x

Harish Rao: ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

Highlights

Harish Rao: సరదాగా కొంతసేపు కైట్ ఎగరవేసిన హరీష్ రావు

Harish Rao: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పతంగుల పండగ అంటే ఆనందం, ఆహ్లాదంతో పాటు సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందని తెలిపారు. పతంగులకి దారం ఆధారం అయితే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం అని హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు నెక్లెస్ పై కైట్ ఫెస్టివల్ ను హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేటలో మూడు రోజుల పాటు కన్నుల పండువగా పతంగుల పండగ జరుగుతుందని మాజీ మంత్రి తెలియజేశారు.. సరదాగా కొంతసేపు హరీష్ రావు కైట్ ఎగరవేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories