Harish Rao: ప్రజల కరువు తీర్చే అతి పెద్ద ప్రాజెక్టు పాల‌మూరు ఎత్తిపోత‌ల

Harish Rao Comments on Opposition Party
x

Harish Rao: ప్రజల కరువు తీర్చే అతి పెద్ద ప్రాజెక్టు పాల‌మూరు ఎత్తిపోత‌ల

Highlights

Harish Rao: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రతిపక్షాల విమర్శలు

Harish Rao: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు అన్నారు.. ఖమ్మంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నా పెద్దదయిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని, కానీ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారాయన... పాలమూరు ప్రజలంతా సంతోషంతో ఉన్నారని, పాలమూరు ప్రజల శాశ్వత కరువును తీర్చే ప్రాజెక్టు అన్నారు.

ప్రజలకు మంచి చేసే ప్రతి పనిని ప్రతిపక్ష పార్టీలు ఏదో విధంగా అడ్డుకుంటున్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు.. రానున్న ఎన్నికలు నోబుల్స్‌కు గ్లోబల్స్‌కు మధ్య జరుగుతున్నాయని, ప్రజలు ఎప్పుడయినా నోబుల్స్‌ను కోరుకుంటారని చెప్పారు హరీశ్ రావు... ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి ధర్మమే గెలిచిందని, ఆర్టీసీ బిల్లు ఆమోదం పొందిందని, ఆర్టీసీ కార్మికులు నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారని, ప్రభుత్వ ఖజానా నుంచే ఆర్టీసీ సిబ్బంది జీతాలు చెల్లిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories