Harish Rao: తెలంగాణపై గవర్నర్ విధానంలో మార్పు లేదు

Harish Rao Comments on Governor Tamilisai
x

Harish Rao: తెలంగాణపై గవర్నర్ విధానంలో మార్పు లేదు

Highlights

Harish Rao: దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ బీఆర్ఎస్ సభ్యులని.. గవర్నర్ అనర్హులని ప్రకటించడం కరెక్ట్ కాదు

Harish Rao: దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్‌ తమిళిసై నిర్ణయించడం దారుణమన్నారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ సభ్యులుగా ఉండటం వల్ల అనర్హులంటున్న గవర్నర్.. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ తమిళిసై గవర్నర్‌గా ఎలా ఉంటారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో ఎంతోమంది బీజేపీ నేతలు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు పొందారని.. బీజేపీకి ఒక న్యాయం.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణలు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారన్న హరీష్ రావు.. వారు తమతమ రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. అలాంటివారికి ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తే.. గవర్నర్ తిరస్కరించడం సరికాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories