Harish Rao: బీఆర్ఎస్ ఓటమి తాత్కాలికమే.. భవిష్యత్ మనదే

Harish Rao Comments On Congress
x

Harish Rao: బీఆర్ఎస్ ఓటమి తాత్కాలికమే.. భవిష్యత్ మనదే

Highlights

Harish Rao: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై 7 మండలాలను ఏపీలో కలిపాయి

Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలు పెరిగాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు.. కేసీఆర్ కక్షసాధింపు చర్యలకు దిగి ఉంటే కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండేవారన్నారు. బీఆర్ఎస్ ఓటమి తాత్కాలికమేనన్న ఆయన.. భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ విషయానికి వంద రోజుల డెడ్‌లైన్ పెడుతోందన్న హరీష్ రావు.. వంద రోజుల తర్వాత ప్రజలే కాంగ్రెస్‌పై చీటింగ్ కేసులు పెడతారని అన్నారు. నాలుగు రోజులైతే ప్రజలే బీఆర్ఎస్‌కు పట్టం కడతారని కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories