Harish Rao: అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉండాలి

Harish Rao Attend To 5k Run In Siddipeta On Womens Day
x

Harish Rao: అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉండాలి

Highlights

Harish Rao: 5 కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

Harish Rao: అన్నిరంగాల్లో తెలంగాణ రాష్ట్రం, దేశానికి దిక్సూచిగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. విద్యా, ఉద్యోగ, పారిశ్రామిక, రంగాల్లో మహిళలు ముందు ఉండేలా అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో సిద్దిపేట డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో 5 కే రన్‌ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అన్ని స్కూళ్లలో యోగా నేర్పించాలలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక మహిళా రెసిడెన్షియల్ స్కూళ్లు, డిగ్రీ, పీజీ కాలేజీలు ఏర్పటు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఏ పరీక్ష ఫలితాల్లో చూసినా మహిళలే టాపర్లుగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో సహకరిస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories