Harish Rao vs Sridhar Babu: బీఏసీ సమావేశంలో హరీశ్ రావు వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు

Harish Ra on vs Sridhar Babu in BAC Meeting
x

Harish Rao vs Sridhar Babu: బీఏసీ సమావేశంలో హరీశ్ రావు వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు

Highlights

Harish Rao vs Sridhar Babu: బీఏసీ సమావేశం కోసం స్పీకర్ ఛాంబర్‌కు వచ్చిన హరీశ్ రావు

Harish Rao vs Sridhar Babu: బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరుకావడంతో సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం తెలపడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వదం జరిగింది. బీఏసీ సమావేశం కోసం కడియం శ్రీహరితో కలిసి స్పీకర్ ఛాంబర్‌‌కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వెళ్లారు. హరీశ్ రావు రావడాన్ని శ్రీధర్ బాబు వ్యతిరేకించారు. తనకు బదులు హరీశ్ రావు హాజరు అవుతారని స్పీకర్‌కు కేసీఆర్ ఫోన్ చేసి తెలిపారని గుర్తుచేశారు. కేసీఆర్ వినతిపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని శ్రీధర్ బాబు చెప్పడంతో కాసేపటికి అక్కడి నుంచి హరీశ్ రావు వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories