హైదరాబాద్‌లో మరో ఘోరం..సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై అత్యాచారం

హైదరాబాద్‌లో మరో ఘోరం..సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై అత్యాచారం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

నేటి కాలంలో ఒక మనిషిని మరో మనిషి నమ్మడానికి వీలు లేకుండా పోతుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాల సంఖ్యే దానికి కారణం.

నేటి కాలంలో ఒక మనిషిని మరో మనిషి నమ్మడానికి వీలు లేకుండా పోతుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాల సంఖ్యే దానికి కారణం. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు ఇవే నేరాలు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ , ప్రతిజిల్లాలోనూ ఇవే సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వైపు ప్రజలు రోడ్లపైకి వచ్చి కామాంధులను ఉరితీయాలని ఆందోళనలు చేస్తుంటే మరోవైపు మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న వరంగల్ లో ఓ యువతి స్నేహితుడని నమ్మి అతనితో బయటికి వెళ్లింది. దాంతో ఆ యువతిపై తన స్నేహితుడే అత్యాచారానికి పాల్పడడంతో ఆ యువతి అక్కడికి మృతి చెందింది.

ఆ సంఘటన మరచిపోకముందే హైదరాబాద్ లో మూడు రోజుల క్రితం వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను అక్కడికక్కడే దహనం చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్నే సృస్టించింది. ఇంతటి అమానుషమైన సంఘటనను మరచిపోకముందే అదే హైదరాబాద్ లోని నిజాంపేటలో ఓ ఘోరం వెలుగులోకొచ్చింది. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్న యువతి తన సోదరి ఇద్దరూ నిజాంపేటలోని ఈశ్వర్ విలాస్ రోడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి జాయల్ చంద్(27) అనే స్నేహితుడున్నాడు. అతను తరచూ వారి ఇంటికి వస్తూ, పోతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శనివారం కూడా జాయెల్ ఆమెని కలవడానికి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో ఆ యువతి ఒంటరిగా ఉండడంతో అతను ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి అపస్మారక స్థితికి వెళ్లింది. తాను అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆ నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

ఎప్పటిలాడే తన పనులను చూసుకుని సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన బాదితురాలి సోదరి గదిలో నగ్నంగా పడి ఉన్న ఆమెను గమనించి ఆస్పత్రికి తీసుకె‌ళ్లింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories