హాజీపూర్ వరుస హత్యల కేసులో రేపే తీర్పు

హాజీపూర్ వరుస హత్యల కేసులో రేపే తీర్పు
x
Hajipur Srinivas Reddy File Photo
Highlights

నల్గొండ జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

నల్గొండ జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా.. హాజీపూర్‌ అత్యాచారం, హత్య కేసు విచారణ తుది దశకు చేరిన విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నించగా, నివ్వెరపరిచే విషయాలు వెల్లడించాడు. ఈ కేసులో నిందితుడు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిపై ఫోక్సో స్పెషల్‌ కోర్టు రేపు తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో రాచకొండ పోలీసులు పూర్తి సాక్యాధారాలను కోర్టుకు సమర్పించారు. ప్రాసిక్యూషన్ కూడా నిందితుడికి ఉరిశిక్ష విధించాలని వాదించింది. ఈ నేపథ్యంలో ఫోక్సో స్పెషల్‌ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అంతకుముందు ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫోక్సో స్పెషల్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మనీషా కేసుకు సంబంధించి 29 మంది సాక్షులు చెప్పిన వాంగ్మూలాలను నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి వినిపించారు. వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. కాగా తీర్పును గురువారం వెల్లడించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories