ఇవాళ సమత, హాజీపూర్ వరుస హత్యలపై తుది తీర్పు

ఇవాళ సమత,  హాజీపూర్ వరుస హత్యలపై తుది తీర్పు
x
Highlights

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలపై ఇవాళ తుది తీర్పు రానుంది. హాజీపూర్‌లో బాలికలు దారుణంగా అత్యాచారం, హత్యలపై నల్గొండలోని...

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలపై ఇవాళ తుది తీర్పు రానుంది. హాజీపూర్‌లో బాలికలు దారుణంగా అత్యాచారం, హత్యలపై నల్గొండలోని ప్రత్యేక ఫోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుల్లో హాజీపూర్‌ నిందితుడు వరంగల్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అక్టోబర్ 14 నుంచి హాజీపూర్ కేసులపై విచారణ జరుగుతుంది. ఈ కేసుల్లో 101 మంది సాక్షులను కోర్టు విచారించింది. నిందితుడిని కోర్టు ఎగ్జామిన్ చేసింది. అత్యాచారం, హత్యలపై ఇరు పక్షాల న్యాయవాదులు జడ్జీ ముందు వాదనలు వినిపించారు. జనవరి 17న తుది వాదనలు ముగిశాయి. నిందితుడికి ఉరే సరని హాజీపూర్ గ్రామస్తులంటున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సమత అత్యాచారం, హత్య కేసుపై ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. కుమ్రంబీమ్ జిల్లా ఎల్లాపటార్‌లో ముగ్గురు నిందితులు సమతను గ్యాంగ్‌ రేప్ చేసి హత్య చేశారు. కేసు విచారణ కోసం డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు డిసెంబర్ 14న 90 పేజీల చార్జ్‌ షీటును దాఖలు చేశారు.40 మంది సాక్షుల్లో 20మందిని డిసెంబర్ 23 నుంచి 31 వరకు కోర్టు విచారించింది. నిందితుల తరపున వాదించడానికి న్యాయవాదులు ముందుకు రాకపోవడంతో కోర్టు న్యాయవాది రహీంను నియమించింది. 42 రోజుల్లో తీర్పు వస్తుండటంతో తీర్పుపై ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories