Top
logo

హాజీపూర్ వరుస హత్యలపై సోమవారం తుది తీర్పు

హాజీపూర్ వరుస హత్యలపై సోమవారం తుది తీర్పు
X
Highlights

- తీర్పు వెల్లడించనున్న నల్గొండ ప్రత్యేక ఫోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు - 101 మంది సాక్షులను విచారించిన కోర్టు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలపై సోమవారం తుది తీర్పు రానుంది. హాజీపూర్‌లో బాలికలు దారుణంగా అత్యాచారం, హత్యలపై నల్గొండలోని ప్రత్యేక ఫోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుల్లో హాజీపూర్‌ నిందితుడు వరంగల్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అక్టోబర్ 14 నుంచి హాజీపూర్ కేసులపై విచారణ జరుగుతుంది. ఈ కేసుల్లో 101 మంది సాక్షులను కోర్టు విచారించింది. నిందితుడిని కోర్టు ఎగ్జామిన్ చేసింది. అత్యాచారం, హత్యలపై ఇరు పక్షాల న్యాయవాదులు జడ్జీ ముందు వాదనలు వినిపించారు. జనవరి 17న తుది వాదనలు ముగిశాయి. నిందితుడికి ఉరే సరని హాజీపూర్ గ్రామస్తులంటున్నారు.

Web TitleHajipur Case final verdict On Monday
Next Story