తెలంగాణలో అధికార కాంగ్రెస్ పై బీజేపీ ఫోకస్ చేస్తుందా?

Had BJP Focussing on Congress Corruption in Telangana
x

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పై బీజేపీ ఫోకస్ చేస్తుందా?

Highlights

Telangana: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పై బిజేపీ ఫోకస్ చేస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని వెలికి తీసే పనిలో పడిందా?

Telangana: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పై బిజేపీ ఫోకస్ చేస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని వెలికి తీసే పనిలో పడిందా? ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అవినీతి ఆధారాలను బీజేపీ జాతీయ నాయకత్వానికి ఇచ్చిందా? త్వరలోనే అవినీతి ఆధారాలను హైకోర్టుకు సబ్మిట్ చేయనుందా? సిబిఐ విచారణ జరగాలని బీజేపీ కోరుకుంటుందా? ఇంతకీ అవినీతిని ఎందుకు హైలెట్ చేయాలనుకుంటుంది? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది?

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పై బిజెపి అవినీతి ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేస్తుందని బిజెపి నేతలు పదేపదే చెప్తున్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడు లేని విధంగా కాంగ్రెస్ కొత్త సంస్కృతి తీసుకొచ్చిందని, ఏ పనులు కావాలన్నా టాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలంగాణలో త్రిబల్ R టాక్స్ మీద పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా త్రిబల్ R టాక్స్ పైన ఘాటు విమర్శలు చేశారు.

త్రిబల్ R టాక్స్ తో పాటుగా B టాక్స్,U టాక్స్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా బిజెపి నేతలు చేశారు. ఇక ఏకంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన బిజెపి శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. ఆధారాలున్నాయి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ కూడా చేశారు. అయితే ఈ అంశం పైన రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇక రానున్న రోజుల్లో అవినీతిపైన ఆరోపణలు చేయడమే కాకుండా వాటికి సరైన ఆధారాలను చూపించి మరీ అధికార పార్టీని ఇరికించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ఆధారలను సేకరించి బీజేపీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నేతలు అందించారు. రానున్న రోజుల్లో జరుగుతున్నటువంటి అవినీతిని ఆధారాలతో సహా వెలికి తీయాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు సూచించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో అవినీతి ఏ ఏ శాఖలో జరుగుతున్నాయో పూర్తిగా ఆధారాలతో బయటపెట్టడానికి బీజేపీ సిద్ధమవుతోంది. త్వరలోనే హైకోర్టును ఆశ్రయించినున్నట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పైన చేస్తున్న అవినీతి ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించాలన్న బీజేపీ ప్లాన్స్ ఏ మేరకు ఫలితాలను ఇస్తాయో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories