Gutha Sukender Reddy: కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అధోగతి పాలవుతుంది

Gutha Sukender Reddy  Fires On Congress Party
x

Gutha Sukender Reddy: కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అధోగతి పాలవుతుంది

Highlights

Gutha Sukender Reddy: అధికారం కోసమే కాంగ్రెస్ నేతలు దురాలోచన చేస్తున్నారని ఆగ్రహం

Gutha Sukender Reddy: కాంగ్రెస్‌ పార్టీపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైరయ్యారు. అధికారం కోసమే కాంగ్రెస్ వాళ్లు దురాలోచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు లేని నిరుద్యోగులు నల్గొండలో ర్యాలీ నిర్వహించి నానా హంగామా చేశారని విమర్శించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.

2018లో తన స్నేహితుడు కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో కోమటిరెడ్డి చిత్తుగా ఓడిపోయాడని.. అయినా బుద్ధి మారలేదన్నారు. ఆయన తమ్ముడు రాజగోపాల్‎ని, అన్న మోహన్ రెడ్డిలను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తుక్కుగా ఓడిచించారని గుర్తుచేశారు. స్థిరత్వం లేని కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, వెంకట్‌రెడ్డి పిచ్చి ముదిరిందన్నారు. ఉదయం బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానని మధ్యాహ్నం కాంగ్రెస్, సాయంత్రం బీజేపీ అమిత్ షాతో మాట్లాడుతున్నారని ఎద్దేశా చేశారు. ఐదెకరాల భూమి ఉందన్న కోమటిరెడ్డికి హైదరాబాద్‌లో విల్లాలు, ఇతర ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories