Gutha Sukender Reddy: రేవంత్, కోమటిరెడ్డి వ్యాఖ్యలకు గుత్తా కౌంటర్.. వ్యవసాయం అంటే ఏమిటో తెలియదంటూ ఎద్దేవా

Gutha Sukender Reddy Counter to Revanth and Komatireddy Comments
x

Gutha Sukender Reddy: రేవంత్, కోమటిరెడ్డి వ్యాఖ్యలకు గుత్తా కౌంటర్.. వ్యవసాయం అంటే ఏమిటో తెలియదంటూ ఎద్దేవా

Highlights

Gutha Sukender Reddy: విద్యుత్‌పై రేవంత్ అసత్య ప్రచారం మానుకోవాలి

Gutha Sukender Reddy: TPCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. వ్యవసాయం అంటే ఎంటో తెలియని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి లను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు కేసీఆర్ కారణమని ఆనడం రేవంత్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని అన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారని ఆయన మాటలను పరిగణలోకి తీసుకోవద్దని విమర్శించారు.

తెలంగాణకు అనేక అవార్డులు వస్తున్న ప్రతి పక్షాలకు కనపడటం లేదన్నారు. తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ లను కేంద్రం అడుగడుగునా అడ్టుకోవాలని చూస్తుందని విమర్శించారు. విద్యుత్ కోనుగోళ్లలో స్కామ్ లేదని రైతుల సంక్షేమ ప్రభుత్వం కేసీఆర్ అధ్వర్యంలో మళ్లీ వస్తుందని గుత్తా అన్నారు‌.

Show Full Article
Print Article
Next Story
More Stories