Jagadish Reddy: ఎడారిలా ఉన్న పెద్దగట్టు సస్యశ్యామలంగా మారింది

Guntakandla Jagadish Reddy Comments
x

Jagadish Reddy: ఎడారిలా ఉన్న పెద్దగట్టు సస్యశ్యామలంగా మారింది

Highlights

Jagadish Reddy: కాళేశ్వరం జలాలతో లింగమంతుల స్వామి పాదాలను తడిపాం

Jagadish Reddy: తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు అభివృద్ధి యజ్ఞంతో ఎడారిలా ఉన్న పెద్దగట్టు ప్రాంతం సస్యశ్యామలం అయిందన్నారు మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కాళేశ్వరం మొదటి ప్రతిఫలం అందుకున్న ప్రాంతం సూర్యాపేటే అన్న మంత్రి గోదావరి జలాలతో లింగమంతుల స్వామి పాదాలను తడిపామన్నారు. కాళేశ్వరం జలాలతో లింగమంతుల స్వామి పాదాలు కడిగే భాగ్యం సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. స్వామి ఆశీస్సులతో దేశంలోనే సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నాయన్నారాయ. కాలం కలిసొచ్చి పాడి పంటలు బాగా పండాలని లింగమంతుల స్వామిని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు.

ప్రతీ ఒక్కరికీ లింగమంతుల స్వామి ఆశీస్సులు ఉండాలన్న మంత్రి స్వామి ఆశీస్సులతో మళ్లీ రెండేళ్ల తర్వాత జాతర నాటికి తెలంగాణ మరింత అభివృద్ధి చెంది, ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పెద్దగట్టు జాతరకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారని తెలిపారు. ఇక్కడికి వస్తున్న భక్తుల్లో కనిపిస్తున్న కోలాహలం, సంతోషమే రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని జగదీశ్ రెడ్డి అన్నారు. లింగమంతుల స్వామి అ మ్మవార్లను మంత్రి దర్శించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories