మహిళా దినోత్సవం రోజు కార్మికుల కాళ్లు కడిగిన గూడూరు

Gudur Narayana Reddy Comments on MLC Kavitha
x

మహిళా దినోత్సవం రోజు కార్మికుల కాళ్లు కడిగిన గూడూరు

Highlights

Gudur Narayana Reddy: తెలంగాణలో మహిళల ప్రతిష్టను కవిత మంటగలిపారు

Gudur Narayana Reddy: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్ర.. రాష్ట్ర మహిళల ప్రతిష్టను మంటగలిపిందన్నారు బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి. భువనగిరి జిల్లా గూడూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ మహిళా కార్మికుల పాదాలు కడిగారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం వినియోగాన్ని నిర్మూలించాలని పోరాడకుండా... కవిత లిక్కర్‌ స్కాంలో చిక్కుకుందని ఆయన విమర్శించారు. ఇష్టానుసారంగా బెల్టు షాపుల ఏర్పాటు వల్ల ఏటా వేలాది మంది మహిళలు వితంతువులుగా మారుతున్నారన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రానికి చెందిన ఏకైక మహిళగా కవితను ప్రభుత్వం పరిగణిస్తోందని, రాష్ట్రంలోని రెండు కోట్ల మందికి పైగా మహిళల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories