Gruha Jyothi Scheme: ‘గృహ జ్యోతి’ లిమిట్ పెరుగుతుందా? అసెంబ్లీలో భట్టి విక్రమార్క స్పష్టత..!!

Gruha Jyothi Scheme: ‘గృహ జ్యోతి’ లిమిట్ పెరుగుతుందా? అసెంబ్లీలో భట్టి విక్రమార్క స్పష్టత..!!
x
Highlights

Gruha Jyothi Scheme: ‘గృహ జ్యోతి’ లిమిట్ పెరుగుతుందా? అసెంబ్లీలో భట్టి విక్రమార్క స్పష్టత..!!

Gruha Jyothi Scheme: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహ జ్యోతి’ పథకంపై మరోసారి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ పథకం కింద గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అయితే 200 యూనిట్ల పరిమితి దాటితే మొత్తం బిల్లు చెల్లించాల్సి వస్తుండటంపై ప్రజల్లో, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే అంశాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభలో ప్రస్తావించారు.

విద్యుత్ వినియోగం 200 యూనిట్లకు కాస్త ఎక్కువైనా మొత్తం బిల్లు కట్టాల్సి రావడం భారంగా మారిందని ఆయన పేర్కొన్నారు. కనీసం 200 యూనిట్లు దాటిన అదనపు యూనిట్లకు మాత్రమే చార్జీలు వసూలు చేసేలా నిబంధనలు సడలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ‘గృహ జ్యోతి’ లిమిట్ పెరుగుతుందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా స్పందించారు. “ఎన్నికలకు ముందు ప్రజలకు స్పష్టంగా చెప్పిందే అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ అని హామీ ఇచ్చాం. 200 యూనిట్లు దాటితే ఈ పథకం వర్తించదు. పథకంలో లేని అంశాన్ని అమలు చేయడం సాధ్యం కాదు” అని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలకు స్పష్టత ఇవ్వడానికే ఈ వ్యాఖ్యలు చేశామని తెలిపారు.

ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై ఉన్న భారం దృష్ట్యా ప్రస్తుతం విధానంలో మార్పు లేదని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రకటనతో ‘గృహ జ్యోతి’ పథకం పరిమితి పెరుగుతుందన్న ఊహాగానాలకు తెరపడినట్లైంది. అయినప్పటికీ, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories