Telangana: గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేయాల్సిందే.. టీఎస్పీఎస్సీని ముట్టడించిన అభ్యర్థులు

Group 2 Candidates Siege TSPSC over Exam Postpone Demand
x

Telangana: గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేయాల్సిందే.. టీఎస్పీఎస్సీని ముట్టడించిన అభ్యర్థులు

Highlights

Telangana: ప్రిపేర్ కాలేకపోతున్నామంటున్న నిరుద్యోగులు

Telangana: తెలంగాణలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. అయితే ఈ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ ఇప్పుడు అభ్యర్థులు కోరుతున్నారు. ఆగస్టు నెలలో గురుకుల బోర్డు పరీక్షలు ఉన్నందున రెండు పరీక్షలకు ఒకేసారి ప్రిపేర్ కాలేకపోతున్నామని మూడు నెలలు గ్రూప్ -2 పరీక్షను అభ్యర్థులు వాయిదా వేయాలంటున్నారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థులు చేరుకొని పబ్లిక్‌ కమిషన్‌ను ముట్టడించారు.

గురుకులాల సిలబస్, గ్రూప్-2 సిలబస్ వేరువేరుగా ఉన్నందున ఒకే అభ్యర్థి రెండు పరీక్షల సిలబస్ను కవర్ చేయడం ఇబ్బందిగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో గురుకుల పరీక్షలు ముగిసిన తర్వాత రెండు నెలల కు గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మూడు నెలలపాటు గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేయాలంటూ TSPSCను అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories