Warangal: ముహూర్తం దాటిపోతుంది.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వరుడు..

Groom Stuck in Traffic in Warangal
x

Warangal: ముహూర్తం దాటిపోతుంది.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వరుడు..

Highlights

Warangal: వర్ధన్నపేట మండలం ఇల్లందలో బోల్తాపడిన లారీ

Warangal: అసలే ముహూర్తం దాటిపోతుంది.. పెళ్లి కొడుకేమో ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు. కారులో కూర్చున్న తనకు రహదారిపై ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఎప్పుడెప్పుడు కళ్యాణవేదికకు చేరుకుంటానా అనుకున్న తనకు ఆయిల్ ట్యాంకర్ అడ్డొచ్చింది. ఆరా తీస్తే రోడ్డుకు అడ్డంగా ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడిందని తెలిసింది. దీంతో ట్రాఫిక్ క్లియర్‌ చేయాలని పోలీసులను వేడుకున్నాడు ఓ పెళ్లికొడుకు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడం ఓ యువకుడి పెళ్లికి అడ్డంకిగా మారింది. లారీ బోల్తాపడడంతో ఖమ్మం, వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వరంగల్ నుంచి తొర్రూర్‌కు వెళ్లాల్సిన పె‌ళ్లికొడుకు కారు సైతం అందులోనే చిక్కుకుపోయింది.

అయితే ముహూర్తం ఉదయం 10 గంటలకే ఉండడంతో ట్రాఫిక్ క్లియర్ చేయాలని పోలీసులను కోరాడు. పెళ్లి ముహూర్తం దాటిపోతుందని తమను తొందరగా పంపించే ప్రయత్నంచేయాలని వేడుకున్నాడు. ఒక్కొక్కటిగా వాహనాలను పంపిస్తున్న పోలీసులు వెయిట్ చేయాలని సూచించారు. దీంతో చేసేదేం లేక వచ్చిన కారులోనే వెనక్కి వెళ్లి కొంతదూరం ప్రయాణించారు. అయితే ఇంతలోనే వాహనాలు ముందుకు కదలడంతో మళ్లీ వెనక్కి వచ్చి తొర్రూర్‌ బయలుదేరాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories