Governor Tamilisai: ప్రగతిభవన్.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది

Governor Tamilisai Speech In TS Assembly
x

Governor Tamilisai: ప్రగతిభవన్.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది

Highlights

Governor Tamilisai: ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లభించింది

Governor Tamilisai: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ తమిళిసై ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజాకవి కాళోజీ నారాయణరావు కవిత చదివి ప్రసంగం స్టార్ట్ చేశారు. తెలంగాణ ప్రజలు.. ప్రజాస్వామ్యం కోసం పోరాడారని అన్నారు. ప్రగతిభవన్.. ప్రజా భవన్‌గా అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లభించిందని తెలిపారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామన్న ఆమె.. మరో రెండు గ్యారంటీలను త్వరలోనే అమలు చేయబోతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories