Governor Tamilisai: ఆర్టీసీ బిల్లుపై వివరణ కోరిన గవర్నర్‌

Governor Tamilisai on TSRTC Bill
x

Governor Tamilisai: ఆర్టీసీ బిల్లుపై వివరణ కోరిన గవర్నర్‌

Highlights

Governor Tamilisai: TSRTC బిల్లులో స్పష్టత లేని అంశాలపై.. ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలన్న గవర్నర్ కార్యాలయం

Governor Tamilisai: ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళి సై వివరణ కోరారు. ఐదు అంశాలపై సర్కార్‌ను వివరాలు అడిగారు.1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవని గవర్నర్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవన్నారామె. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం... వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా..? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయని గవర్నర్ ప్రశ్నించారు.

విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా..? వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తమిళి సై కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందేలా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. అంతేగాకుండా ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలు ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories