Governor Tamilisai: వైద్యరంగంలో వసతులు మరింత మెరుగపరచాలి

Governor Key Remarks
x

Governor Tamilisai Soundararajan: వైద్యరంగంలో వసతులు మరింత మెరుగపరచాలి

Highlights

Governor Tamilisai: మలక్‌‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతిచెందడం బాధాకరం

Governor Tamilisai: గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలక్‌‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతిచెందడం బాధాకరమన్నారు. ఓ గైనకాలజిస్ట్‌గా నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని చెప్పారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారని గుర్తుచేశారు. వైద్యరంగంలో వసతులు మరింత మెరుగపరచాలి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక బిల్లులు పెండింగ్‌లో కాదు పరిశీలనలో ఉన్నాయని స్పష్టం చేశారు. వర్సిటీ నియామకాల్లో బిల్లుల్లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక యునివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కావాలన్నారు గవర్నర్ తమిళిసై.

Show Full Article
Print Article
Next Story
More Stories