కేసీఆర్‌ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాలలోకి వెళ్లింది

కేసీఆర్‌ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాలలోకి వెళ్లింది
x
Highlights

-కేసీఆర్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాలలోకి వెళ్లింది -ప్రభుత్వం ఆర్టీసీ నుంచి పన్నుల రూపంలో.. 850 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది -బస్‌ పాస్‌లకు ఇవ్వాల్సిన 700 కోట్ల సబ్సిడీని కూడా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించడం లేదు

కేసీఆర్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాలలోకి వెళ్లిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఆర్టీసీ నుంచి పన్నుల రూపంలో 850 కోట్ల రూపాయలు వసూలు చేస్తోందని లెక్కలతో సహా వివరించారు. వికలాంగులకు, పేదలకు, విద్యార్ధులకు బస్‌ పాస్‌లకు ఇవ్వాల్సిన 700 కోట్ల సబ్సిడీని కూడా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించడం లేదన్నారు. దీంతో ఆర్టీసీపై దాదాపు 1500 కోట్ల ఆర్ధిక భారం పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. నష్టాలను తగ్గించాలని అలా కాకుండా ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న యోచన ఇప్పటిది కాదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories