పేదలకు అందని ద్రాక్షగా ప్రభుత్వ ఆర్థిక సాయం!

పేదలకు అందని ద్రాక్షగా ప్రభుత్వ ఆర్థిక సాయం!
x
financial help to poor (rep.image)
Highlights

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం అందని ద్రాక్షగా మారింది. రెండు నెలలుగా 15 వందల రూపాయలను అందిస్తున్నా అసలు లబ్ధిదారులకు డబ్బులు అందటం లేదు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం అందని ద్రాక్షగా మారింది. రెండు నెలలుగా 15 వందల రూపాయలను అందిస్తున్నా అసలు లబ్ధిదారులకు డబ్బులు అందటం లేదు. కొన్ని చోట్ల చనిపోయిన వారి ఖాతాల్లోకి డబ్బులు జమవుతుండటం మరికొందరి పేరు లిస్టులో ఉన్నా బ్యాంకుల్లో డబ్బులు ఉండటం లేదు. దీంతో సమస్యలు పరిష‌్కరించి డబ్బులు అందేలా చూడాలని కోరుతున్నారు లబ్ధిదారులు.

తెలంగాణలోని పేదలు లాక్‌డౌన్‌ లో ఇబ్బందులు పడకుండా మనిషికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి 15 వందల రూపాయలు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. డబ్బుల పంపిణీలో అవకతవకలు జరగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమచేసింది. కానీ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారాయి. రెండు, మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తుల పేరు మీద కూడా కార్డులు ఉండటంతో వారి అకౌంట్లలో నగదు జమైంది. ఒక్క బొంరాస్ పేట మండలం కేంద్రంలోనే 20 మంది చనిపోయిన వారి పేరున ఖాతాలో నగదు జమ కాగా హోల్డ్ లో ఉన్న ఖాతా దారులెంత మందో ఇప్పటికీ లెక్కలేదు.

బ్యాంక్‌కు వెళ్లిన కుటుంబసభ్యులకు రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెస్తేనే నగదు చెల్లిస్తామని అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన తమ వారి డెత్ సర్టిఫుకెట్స్ తీసుకురాలేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేటలోనే ఇలాంటి సమస్యలు దాదాపు నలభై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడటంతో డెత్‌ సర్టిఫికెట్లు కూడా ఇచ్చే పరిస్థితులు లేవంటున్నారు.

ప్రభుత్వం వేసిన డబ్బులే కాదు ఇతరుల నుంచి వచ్చిన డబ్బులను కూడా బ్యాంక్‌ అధికారులు హోల్డ్‌ లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. అప్పులు చేయాలన్నా ఎవరూ ఇచ్చే పరిస్థితులు లేవంటున్నారు. కొన్నిచోట్ల రెవెన్యూ అధికారుల దగ్గర ఉన్న లిస్ట్‌లో లబ్ధిదారుల పేర్లు ఉన్నా ఖాతాలో డబ్బులు జమ కాలేదని చెపుతున్నారని వాపోతున్నారు. రెండ్రోజుల్లో లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామంటున్నారు స్థానిక తహసీల్దార్ షాహిదా బేగం.

చనిపోయిన మరియు హోల్డ్ లో ఉన్న ఖాతా దారులకు సంబంధించిన వివరాలు అధికారుల దగ్గర లేకపోవటంతోనే ఈ సమస్యలకు ప్రధాన కారణం కాగా.. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు లబ్ధిదారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories