ఉద్యోగ ఖాళీల లెక్కలను దాచుతున్న ప్రభుత్వం

ఉద్యోగ ఖాళీల లెక్కలను దాచుతున్న ప్రభుత్వం
x
Highlights

* ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు లక్షల్లో..శాఖలు చూపిస్తోంది మాత్రం వేలల్లో *50 వేల పోస్టుల భర్తీపైనే ప్రధాన దృష్టి * ఖాళీల గుర్తింపుపై నిరుద్యోగుల్లో అసహనం

సీఎం కేసీఆర్‌ 50 వేల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు జారీచేసినప్పటి నుంచి ఖాళీల గుర్తింపుపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. శాఖలవారీగా ఖాళీల వివరాలు సమర్పించాలని ఆదేశా లు జారీ చేశారు. ఇప్పటికే దాదాపు 50 వేల ఖాళీల వివరాలను గుర్తించారు. పోలీస్‌ శాఖలో అధికంగా 19,500 కొలువులున్నాయి.

కాగా, పాఠశాల విద్యాశాఖలో దాదాపు 25 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలుంటే.. దాదాపు 10 వేల వరకే ఉన్నాయని ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 5,395 అధ్యాపక పోస్టులు మంజూరవగా, కేవలం 1,340 మందే పనిచేస్తున్నారు. మిగతా 4,055 పోస్టుల్లో కాంట్రాక్ట్‌, గెస్ట్‌ లెక్చరర్లు విధులు నిర్వహిస్తున్నారు. వాటిని ఖాళీలుగా ఇంటర్‌విద్యాశాఖ ప్రభుత్వానికి చూపించలేదు. పలు విశ్వవిద్యాలయాల్లో 1061 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories