Gorakhpur Express: పెద్దపల్లిలో నిలిచిన గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌

Gorakhpur Express Stopped In Peddapalli
x

Gorakhpur Express: పెద్దపల్లిలో నిలిచిన గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌

Highlights

Gorakhpur Express: నీటితో నిండిన రైల్వేస్టేషన్లు.. పలు రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ

Gorakhpur Express: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక వరంగల్ నగరంలో చెప్పే పరిస్థితి లేదు. చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక నగరంలో ఉన్న కాజీపేట రైల్వే స్టేషన్‌లోనూ అదే పరిస్థితి ఉంది. వరద నీరు స్టేషన్‌లోకి వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల పట్టాలపై నీరు చేరడంతో ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా హసన్‌పర్తి-ఖాజీపేట రూట్‌లో రెండు రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.

ఇటు పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లలో గోరఖ్‌పూర్‌ ఎక్స్పెస్‌ 3 గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాజీపేట వడ్డేపల్లి చెరువు ఉప్పొంగి ప్రవాహించడంతో పెద్దపల్లి రేల్వే స్టేషన్‌లోని గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories