Telangana Budget: భూమిలేని రైతు కూలీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. ఏడాదికి 12వేల ఆర్థిక సాయం

Good news of Revant Sarkar for landless farmers. Financial assistance of 12,000 per year
x

 Telangana Budget: భూమిలేని రైతుకూలీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. ఏడాదికి 12వేల ఆర్థిక సాయం

Highlights

Telangana Budget: రైతు కూలీలకు ఏడాదికి రూ. 12వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ ఆర్ధిక సాయాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

Telangana Budget:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా రాష్ట్రంలో భూమిలేని రైతు కూలీలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది. భూమిలేని గ్రామీణ ప్రజానీకం, ఎక్కువగా రైతు కూలీలుగా జీవనం గడుపుతున్నారన్నారు. వారికి ఎలాంటి ఆర్థిక భద్రత లేకపోవడం పనిదొరకని రోజుల్లో పస్తులు ఉంటున్నారు. ఇలాంటి వారి పరిస్థితిపై ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలను చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి సొంత భూములు లేవన్నారు. దీంతో వాళ్లు రైతు కూలీలుగా జీవనం గడుపుతున్నారని మంత్రి అన్నారు. వారి జీవితాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అందుకే అలాంటి రైతు కూలీలకు ఏడాదికి రూ. 12వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ ఆర్ధిక సాయాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతల కోసం రైతు బంధు స్కీమును తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ప్రతిఏడాది రైతులకు ఎకరాకు రూ. 15వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రూ. 2లక్షల రుణమాఫీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు రైతు కూలీలకు ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం వెల్లడించింది. పొలం లేని రైతుల కూలీలకు ఏటా ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతు కూలీలకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు కూడా సాయం అందిస్తామని వెల్లడించారు. లక్ష ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories