School Holiday: విద్యార్థులకి శుభవార్త.. నేడు ఈ స్కూల్స్, కాలేజీలకు సెలవు..

School Holiday: విద్యార్థులకి శుభవార్త.. నేడు ఈ స్కూల్స్, కాలేజీలకు సెలవు..
x
Highlights

School Holiday: విద్యార్థులకు శుభవార్త. నేడు సెలవు ఇచ్చింది ప్రభుత్వం. తెలంగాణలోని సూర్యపేట జిల్లాలో దేవుని వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆ...

School Holiday: విద్యార్థులకు శుభవార్త. నేడు సెలవు ఇచ్చింది ప్రభుత్వం. తెలంగాణలోని సూర్యపేట జిల్లాలో దేవుని వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆ జిల్లాలోని శ్రీ లింగమంతుల స్వామి జాతర చాలా ఫేమస్. దీంతో నేడు చాలా వైభవంగా ఆ దేవుడి జాతర జరుగుతుంది. ఈ నేపథ్యంలో సూర్యపేట జిల్లాల్లోని విద్యా సంస్థలకు నేడు సోమవారం సెలవు ప్రకటించారు. సూర్యపేట జిల్లా కలెక్టర్ ఈ సమాచారాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో నేడు ఈ జిల్లా విద్యా సంస్థలకు సెలవు వచ్చింది. అయితే మంగళవారం మాత్రం సెలవు లేదు.

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో శ్రీలింగమంతుల స్వామి ఆలయం ఒకటి. ప్రతిఏటా వైభవంగా స్వామికి ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. పైగా మేడారం తర్వాత జరిగే అతిపెద్ద జాతరగా దీనికి పేరుంది. ఈ జాతరకు ఈసారి 20 నుంచి 30లక్షల మంది వస్తారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories