Christmas school holidays: తెలంగాణలో ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్

Christmas school holidays
x

Christmas school holidays: తెలంగాణలో ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్

Highlights

Christmas school holidays: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు క్రిస్మస్ సందర్భంగా శుభవార్త అందింది.

Christmas school holidays: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు క్రిస్మస్ సందర్భంగా శుభవార్త అందింది. ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజుల సెలవులు లభించనున్నాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ అధికారిక సెలవు కాగా, ముందురోజు డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలీడే ప్రకటించింది. అలాగే క్రిస్మస్ తర్వాతి రోజు డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా కూడా సెలవు ప్రకటించడంతో, మూడు రోజుల వరుస సెలవులు వచ్చాయి.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం డిసెంబర్ 24న ఆప్షనల్ హాలీడే ఉంటుంది. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు సాధారణంగా పనిచేస్తాయి. అయితే అవసరమైతే ఉద్యోగులు, విద్యార్థులు సెలవు తీసుకోవచ్చు. డిసెంబర్ 25న క్రిస్మస్ హాలీడే కాగా, డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు పూర్తిగా మూతపడనున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, డిసెంబర్ 25న మాత్రమే క్రిస్మస్ సెలవు ఉంది. డిసెంబర్ 24, 26 తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలీడేల జాబితాలో చేర్చింది.

క్రిస్మస్ ఈవ్ నాడు అర్ధరాత్రి ప్రార్థనలతో పండుగ ప్రారంభమవుతుంది. అలాగే డిసెంబర్ 26న జరుపుకునే బాక్సింగ్ డేకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున సంపన్నులు పేదలకు బహుమతులు అందించే సంప్రదాయం ఉంది. వరుసగా సెలవులు రావడంతో ఉద్యోగులు, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories