Golconda Bonalu 2025: సందడిగా గోల్కొండ బోనాల జాతర

Golconda Bonalu 2025
x

Golconda Bonalu 2025: సందడిగా గోల్కొండ బోనాల జాతర

Highlights

Golconda Bonalu 2025: తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఈ పండుగ జోరుగా కొనసాగుతోంది

Golconda Bonalu 2025: తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఈ పండుగ జోరుగా కొనసాగుతోంది. జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పణతో జాతరకి శ్రీకారం చుట్టగా, ఆదివారం రెండో పూజ సందర్భంగా భక్తుల రద్దీ భారీగా కనిపించింది.

ఉదయం నుంచే వేలాదిగా భక్తులు గోల్కొండకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటూ, ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా మార్చారు. కోట పరిసరాలు పూలతో, శ్రద్ధతో, శ్రేయస్సుతో కళకళలాడుతున్నాయి.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ప్రభుత్వం ఈ ఉత్సవాల సందర్భంగా భక్తుల రాకపోకలకు తగిన ఏర్పాట్లు చేసింది. పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు గోల్కొండకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నెల 26 నుంచి ప్రారంభమైన బోనాల పండుగ నెల రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతి గురువారం, ఆదివారం అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. మొత్తం 9 పూజలతో గోల్కొండ బోనాల ఉత్సవం జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది గోల్కొండ బోనాలు జూలై 24న ముగియనున్నాయి.

లష్కర్ బోనాలకి అంకురార్పణ

ఇకపోతే, లష్కర్ బోనాల జాతరకి ఆదివారం అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి ఘటం ఎదుర్కోలు కార్యక్రమం ఈ సందర్భంగా నిర్వహించనున్నారు. ఆలయ అధికారుల ప్రకారం, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి ఆభరణాలను అప్పగించి, ఘటం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

లష్కర్ బోనాలు జూలై 13న జరగనున్నాయని, ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహిస్తారని చెప్పారు. జూలై 14న ఉదయం 8.30 గంటలకు రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories