Bhadrachalam: కొనసాగుతున్న గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ప్రవాహం

Godavari River at the Brink of First Danger Alert
x

Bhadrachalam: కొనసాగుతున్న గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ప్రవాహం

Highlights

కాగా గోదావరి నది ఉధృతి రీత్యా పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అదికారులు హెచ్చరిస్తున్నారు.

Heavy Rains: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ఇంకా కొనసాగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ప్రవాహం కొనసాగుతుండగా.. గోదావరి నీటి మట్టం 42.2 అడుగులకు చేరుకుంది. 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు... అయితే ఇప్పటికే నియోజకవర్గంలోని ముంపు గ్రామాలతోపాటు, భద్రాచలం పట్టణంలోని అనేక కాలనీల ప్రజలను అధికారులు అప్రమతం చేశారు.. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాగా గత తుపాను సమయంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడి భారీగా పంట నష్టపోయిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడ నిర్మిస్తున్న రింగ్ బండ్ సైతం ఈ వర్షానికి కొట్టుకుపోయింది.

కాగా గోదావరి నది ఉధృతి రీత్యా పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అదికారులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories