Dharmapuri: ధర్మపురిలో గోదావరి నదీమ తల్లికి దివ్యహారతులు

Godavari Maha Harathi Yatra
x

Dharmapuri: ధర్మపురిలో గోదావరి నదీమ తల్లికి దివ్యహారతులు

Highlights

Dharmapuri: గోదావరి మహా హారతి యాత్రలో హారతి నివేదన

Dharmapuri: దక్షిణ కాశీగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి నదీమతల్లికి దివ్యహారతులిచ్చారు. గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు...ఈ కార్యక్రమంలో గోదావరి మహా హారతి వ్యవస్థాపక అధ్యక్షుడు పాల్సాని మురళీధర్ రావు హాజరయ్యారు...గత 11 సంవత్సరాలుగా కార్తీక మాసంలో గోదావరి మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తుంటారు... గోదావరి మహా హారతి యాత్రలో భాగంగా కుందనకుర్తిలో గత రెండు రోజుల క్రితం ప్రారంభమైంది.

ఈ యాత్ర మూడవరోజు ధర్మపురికి చేరుకున్న సందర్భంగా గోదావరి మహా హారతి కార్యక్రమం నిర్వహించామని మురళీధర్ రావు తెలిపారు... గోదావరి నది లేకుంటే ఆంధ్రా లేదు,తెలంగాణ లేదు సస్యశ్యామలమే ఉండదని గోదావరి నదిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నదన్నారు... గోదావరి తీరంలో అటవీ సంపదను పెంపొందించాలని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories