గ్రేటర్ లో ఎన్నికల కసరత్తు

గ్రేటర్ లో ఎన్నికల కసరత్తు
x
Highlights

హైదరాబాద్ నగరంలో ఎన్నికల హడావుడి మొదలవనుంది. గ్రేటర్ ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్న‌ది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో బల్దియా...

హైదరాబాద్ నగరంలో ఎన్నికల హడావుడి మొదలవనుంది. గ్రేటర్ ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్న‌ది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో బల్దియా పాలకమండలి కాలపరిమితి ముగియ‌నున్న‌ది. అందువ‌ల్ల ఆలోపే ఎన్నికలు నిర్వ‌హించాల్సి ఉంది. న‌వంబ‌ర్ నెలలో గ్రేట‌ర్‌ హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం 150 డివిజ‌న్‌ల‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించేలా యంత్రాంగం క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఎన్నికల పోలింగ్ ను నిర్వహించేలా అధికారులు చ‌ర్య‌లు చేపడుతూ ఏర్పాట్లు ప్రారంభించారు. కరోనా తీవ్రత నేప‌థ్యంలో బ్యాలెట్​ ద్వారానే ఓటింగ్​ నిర్వహించాల‌ని అధికారులు భావిస్తున్న‌ట్లు సమాచారం. కాగా, అన్ని రాజకీయ పార్టీలు కూడా బ్యాలెట్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు తెలిసింది.

ఈవీఎం మిషిన్లతో పోలింగ్ ను నిర్వహిస్తే కరోనా ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని వివిధ పార్టీల నాయ‌కులు భావిస్తున్నారు. కొవిడ్ కార‌ణంగా ఈవీఎంలవల్ల ఇబ్బందులు వస్తాయని స్పస్టం చేసింది. ఇక, అధికార టీఆర్ఎస్ పార్టీ బ్యాలెట్ పేపర్ ద్వారానే జీహెఎంసీ పోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరింది. అధికారులు కూడా ఈ నిర్ణయంతో ఏకీభవిస్తుండటంవ‌ల్ల‌ బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో పోలింగ్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ప్రధాన ఎన్నికల అధికారిగా జీహెచ్​ఎంసీ క‌మిషనర్​ లోకేశ్​కుమార్‌​ నియమితులయ్యారు. అదేవిధంగా జోన్ల వారీగా నోడల్ ఆఫీసర్లను నియమించారు. ఈవీఎంల వినియోగంవల్ల తలెత్తే పరిణామాలపై అధికారులు నిపుణులతో సుదీర్ఘంగా చర్చిస్తున్న‌ట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories