ఇవాళ ఢిల్లీకి జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు

GHMC Corporators To Delhi Today
x

ఇవాళ ఢిల్లీకి జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు

Highlights

Delhi: సాయంత్రం బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని భేటీ

Delhi: తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో బలపడటమే టార్గెట్‌గా బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ కార్పొరేటర్లను ఢిల్లీ తీసుకుని వెళ్తారు. కార్పొరేటర్లు ప్రధానిని కలిసే అంశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు కార్పొరేటర్లతో మోడీ సమావేశం కానున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై కార్పొరేటర్లకు మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మోడీని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధర్‌రావు సైతం కలవనున్నారు. ఇక కార్పొరేటర్లతో పాటు బీజేపీ సంస్థాగతంగా ఉన్న రంగారెడ్డి అర్బన్‌, భాగ్యనగర్‌, మహంకాళి, గోల్కొండ, మేడ్చల్‌ అర్బన్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లాల అధ్యక్షులు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. .

నిజానికి ప్రధాని మోడీ ఇటీవల హైదరాబాద్‌లోని ISB వార్షికోత్సవానికి వచ్చినప్పుడే పార్టీ కార్పొరేటర్లను కలిసి చర్చించాలని భావించారు. అప్పుడు కుదరకపోవడంతో ఆ సమావేశం రద్దయింది. దీంతో కార్పొరేటర్లు నిరాశ చెందారు. ఈ క్రమంలోనే పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎవరూ నిరాశ చెందవద్దని, త్వరలోనే ప్రధాని మోడీతో భేటీ అవుదామని కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు. కానీ ఇంత త్వరగా కలుస్తామని తాము కూడా ఊహించలేదని కొందరు కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో జీహెచ్ఎంసీలో బీజేపీ నుంచి నలుగురు కార్పొరేటర్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. కాగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సంఖ్య ఒకేసారి 48కి పెరిగింది. అందులో ఒకరు మృతి చెందడంతో బీజేపీ బలం 47గా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని సీట్లను ఈజీగా గెలవాలంటే క్షేత్ర స్థాయిలో కార్యకర్తల కృషి ఎంతో అవసరం. అందుకే ప్రధాని మోడీతో పార్టీ కార్పొరేటర్లకు ఒకసారి భేటీ నిర్వహించినట్లయితే మరింత ఉత్సాహంగా పనిచేస్తారని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories