గణేష్ ఉత్సవాల్లో గంగ హారతి

గణేష్ ఉత్సవాల్లో గంగ హారతి
x
Highlights

హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీతో సమీక్ష నిర్వహించిన మంత్రులు...

హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీతో సమీక్ష నిర్వహించిన మంత్రులు భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, ఈసారి ట్యాంక్ బండ్‌పై తొలిసారి గంగా హారతి నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 2నుంచి 12వరకు జరగనున్న గణేష్ ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక నిమజ్జనం కోసం ఈసారి 26 చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. అయితే, ఈసారి హైదరాబాద్‌లో 57వేలకు పైగా మండపాలు ఉండే అవకాశముందన్నారు. గణేష్‌ ఉత్సవాలంటే హైదరాబాద్ గుర్తుకొస్తుందన్న మంత్రులు ఖైరతాబాద్‌ వినాయకుడికి దేశవ్యాప్తంగా పేరుందన్నారు. అలాగే, తెలంగాణవ్యాప్తంగా పెద్దఎత్తున జరిగే గణేష్ నిమజ్జనం గిన్నిస్ రికార్డులకు ఎక్కాల్సి ఉందన్నారు మంత్రి మల్లారెడ్డి. ఇక, ఈసారి గణేష్ ఉత్సవాల్లో తొలిసారి ట్యాంక్‌బండ్‌‌పై గంగా హారతి ఇవ్వనున్నట్లు తలసాని తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే తెలంగాణలో శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఇక ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories