Etela Rajender: గజ్వేల్ ప్రజలు కేసీఆర్ మోసాలను పసిగట్టారు.. అందుకే కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు

Gajwel People Have Sensed KCR Deception Says Etela Rajender
x

Etela Rajender: గజ్వేల్ ప్రజలు కేసీఆర్ మోసాలను పసిగట్టారు.. అందుకే కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు

Highlights

Etela Rajender: రానున్న ఎన్నికల్లో గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌కు ఓటు వేయొద్దు

Etela Rajender: గజ్వేల్ నుంచి ఓడిపోతానని కేసీఆర్‌కు భయం పట్టుకుందని అందుకే కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ మోసాల గురించి తెలుసుకున్న గజ్వేల్ ప్రజలు ఈసారి నమ్మరని జోస్యం చెప్పారాయన.. సంగారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు... గజ్వేల్ ప్రజలు నమ్మి ఓటేస్తే ప్రజల భూములు గుంజుకొని, బడాబాబులకు కట్టబెట్టడానికి సీఎం సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. గజ్వేల్ ప్రజలకు మోసం చేసిన కేసీఆర్‌కు ఓటు వేయొద్దని ఈటల పిలుపునిచ్చారు. దశాబ్ధి ఉత్సవాల పేరుతో నేరుగా కలెక్టర్లే డబ్బులు డ్రా చేసి దావత్‌లు చేశారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories