TSRTC: పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

Free Travel For Women In RTC Buses Around Telangana
x

TSRTC: పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

Highlights

TSRTC: ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TSRTC: రేపటి నుంచి మహాలక్ష్మి స్కీమ్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 గ్యారెంటీల్లో భాగంగా రేపటి నుంచి ప్రభుత్వం బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్‌ కూడా ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. పల్లె వెలుగు,ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో... మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఉత్తర్వులు ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి.

Show Full Article
Print Article
Next Story
More Stories