పూరీ ఆర్డర్ ఇచ్చి రూ.25 వేలు కొట్టేశాడు..

పూరీ ఆర్డర్ ఇచ్చి రూ.25 వేలు కొట్టేశాడు..
x
Highlights

నిన్న మొన్నటి వరకు ఎక్కువగా జరిగిన సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన పెరిగిపోవడంతో వారు అప్రమత్తమవుతున్నారు.

నిన్న మొన్నటి వరకు ఎక్కువగా జరిగిన సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన పెరిగిపోవడంతో వారు అప్రమత్తమవుతున్నారు. దీంతో సైబర్ నేరగాల్లు వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను కొట్టేయడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. వినియోగదారుల్లాగా, కొనుగోలుదారుల్లాగా వ్యాపారస్తులకు ఫోన్లు చేసి వారిని బురిడీ కొట్టించి డబ్బులను దండుకొంటున్నారు. ఈ కోణంలోనే ఓ కేటుగాడు హోటల్ వ్యాపారికి కాల్ చేసి బురిడీ కొట్టించి ఏకంగా రూ.25వేలను కాజేసాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో చోటు చేసుకుంది.

పూర్తివిరాల్లోకెళితే కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని చందన హోటల్‌‌ యజమానికి ఓ మోసగాడు ఫోన్ చేసాడు. తాను ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నానని హోటల్ యజమానితో పరిచయం చేసుకున్నాడు. తనకు 50 ప్లేట్ల పూరీ కావాలని, తాను హుజూర్ నగర్ నుంచి బయల్దేరుతున్నానని హోటల్ యజమానికి చెప్పాడు. అది నిజమే అనుకున్న హోటల్ యజమాని మొగిలి ఎంత పెద్ద ఆర్డరో అని మురిసిపోయాడు. వెంటనే పూరీ పార్శిల్ చేసి ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేశాడు. అయితే అప్పటికే అతను బయలు దేరానని, నెట్ క్యాష్ ఇచ్చేందుకు అందుబాటులో లేనని, ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపిస్తానని కేటుగాడు తెలిపాడు. దాని కోసం హోటల్ యజమానికి ఏటీఎం కార్డు నంబర్ చెప్పాలని కోరాడు. హోటల్ యాజమాని తనకు ఏటీఎం కార్డు లేదని చెప్పడంతో వేరే వారిది చెప్పమనన్నారు. దీంతో అతను తనకు తెలిసిన వారి నుంచి కార్డును తీసుకుని కార్డు నంబర్‌ చెప్పాడు.

ఆ తరువాత ఏటీఎం కార్డు నంబర్ ద్వారా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసిన వ్యక్తి మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది, ఆ నంబరును తనకు చెప్పాలని చెప్పాడు. అప్పటికీ అది మోసం అని గ్రహించని హోటల్ యజమాని ఫోన్ కు వచ్చిన ఓటీపీని చెప్పాడు. అలా చెప్పగానే రూ.25 వేలు బ్యాంక్ అకౌంట్ నుంచి మాయమయ్యాయి. దీంతో యజమాని వెంటనే తన డబ్బులు కట్ అవుతున్నాయని పూరి ఆర్డర్ ఇచ్చిన కేటుగానికి ఫోన్ చేయగా అతను హిందీలో మాట్లాడి, ఓటీపీ చెబితే డబ్బులు వస్తాయని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకున్న బాధితుడు వెంటనే జరిగిన మోసాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపరిచిత వ్యక్తులకు ఎవరికీ తమ అకౌంట్ డీటేల్స్ , ఓటీపీలు చెప్పకూడదని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories