Kranthi Kiran: తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భూమి మొత్తం భూమయ్యకి రాసిస్తా

Former MLA Kranthi Kiran responded to the allegations against him
x

Kranthi Kiran: తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భూమి మొత్తం భూమయ్యకి రాసిస్తా

Highlights

Kranthi Kiran: నాకు, భూమయ్యకి లై డిటెక్టర్ పరీక్ష చేయండి

Kranthi Kiran: తనపై వస్తున్న ఆరోపణలు.. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న కాల్‌ రికార్డింగ్‌‌పై మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ స్పందించారు. ఈ ఘటనలో మంత్రి దామోదర రాజనర్సింహ కుట్ర ఉందని...రాజకీయంగా కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై నమోదైన కేసు విషయంలో విచారణకు తాను సిద్ధమని.. మంత్రి దామోదర రాజనర్సింహ సిద్ధమా అని ప్రశ్నించారు.

తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే తన భూమి మొత్తం భూమయ్యకి రాసిస్తానని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అయితే దామోదర రాజనర్సింహ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు క్రాంతి కిరణ్. తనకు, ఫిర్యాదు చేసిన భూమయ్యకి లై డిటెక్టర్ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories