Jupally Krishna Rao: కోడేరు పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి జూపల్లి ధర్నా.. ఎస్ఐపై చర్య తీసుకోవాలని డిమాండ్

Former minister Jupally Krishna Rao Dharna In Front Of Koderu Police Station
x

Jupally Krishna Rao: కోడేరు పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి జూపల్లి ధర్నా.. ఎస్ఐపై చర్య తీసుకోవాలని డిమాండ్

Highlights

Jupally Krishna Rao: భూ వివాదంలో కొనుగోలు దార్లను విచారణకు పిలిచి కొట్టడమేంటి?

Jupally Krishna Rao: మాజీమంత్రి జూపల్లి క్రిష్ణారావు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎస్.ఐ. అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. కేసు విచారణ పేరుతో బాధితులను స్టేషన్‌కు పిలిచి కొట్టడమేంటని ప్రశ్నించారు. ఎస్‌ఐపై అట్రా సిటీ కేసు నమోదు చేయాలని జూపల్లి డిమాండ్ చేశారు.

కోడేరు మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన దళిత సర్పంచ్ మశన్న పై అకారణంగా కొట్టి అవమానపరిచిన ఎస్ఐ శేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు. న్యాయంచేయాల్సిన పోలీసులు ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరించి బాధితుడిని భయాందోళనకు గురిచేశాడని పేర్కొన్నారు.

మైలారం గ్రామంలో 8 ఏప్రిల్ 1998 సంవత్సరంలో రాంరెడ్డి అనే పట్టాదారుడు గ్రామానికి చెందిన కొందరికి భూమిని విక్రయించారు. అప్పటినుండి కొనుగోలు చేసిన వ్యక్తులు మోకాపై ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. విక్రయదారులు అమ్మిన భూమి కొనుగోలుదారులకు ధరణిలో మార్పు కాకపోవడంతో అమ్మకం దారులు పోలీసుల అండదండలతో భూమి లాక్కున్నారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగిగాయి. ఇరువురూ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. కొనుగోలుదారులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారిపై అకారణంగా దాడి చేయడం, కొట్టడం అవివేకమని జూపల్లి విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories