తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి జూపల్లి ఆగ్రహం

Former Minister Jupally Fire On  Telangana Government
x

తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి జూపల్లి ఆగ్రహం

Highlights

Jupally Krishna Rao: ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు ముందు చూపు లేదు

Jupally Krishna Rao: నాగర్‌ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ఎల్లూరు వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్‌ వద్ద పంప్‌హౌస్‌ మోటార్లను పరిశీలించారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు సుమారు నాలుగు లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారన్నారు.

ఏప్రిల్‌, మే నెల చివరి వరకు కూడా గతంలో సాగు నీరు ఇచ్చారని.. ఇప్పుడు పంప్‌హౌస్‌ మోటార్లు బంద్‌ చేయడంతో చేతికొచ్చిన పంటలు పాడై రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు ముందు చూపు లేదని.. కనీస జ్ఞానం లేకపోవడమే ఈ పరిస్థితి కారణమని తెలిపారు. మంత్రులు, నాయకులు గొప్ప మాటలు మాట్లడుతారని.. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారని.. కానీ రైతులను పట్టించుకోరని విమర్శించారు జూపల్లి.

Show Full Article
Print Article
Next Story
More Stories