TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా రిటైర్డ్‌ డీజీపీ మహేందర్‌ రెడ్డి!

Former DGP Mahender Reddy as Appointed TSPSC Chairman
x

TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా రిటైర్డ్‌ డీజీపీ మహేందర్‌ రెడ్డి!

Highlights

TSPSC: దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్‌ కమిటీ

TSPSC: TSPSC చైర్మన్‌గా రిటైర్డ్‌ డీజీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఐపీఎస్‌ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల్లో నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైర్మన్‌గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించినట్టు సమాచారం. గవర్నర్‌ ఆమోదించిన వెంటనే ఆయన చైర్మన్‌గా నియమితులు కానున్నారు.

డీజీపీగా పనిచేసి రిటైరైన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న మాజీ అధికారి మహేందర్‌ రెడ్డి మాత్రమే ఉన్నారు. చైర్మన్‌ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డి TSPSC చైర్మన్‌ పదవి భర్తీపై దృష్టి పెట్టారు. చైర్మన్‌తో పాటు సభ్యుల పోస్టుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిని సెర్చ్‌ కమిటీ పరిశీలించింది. ఈ పోస్టుల కోసం వివిధ రంగాలకు చెందిన వారి నుంచి సుమారు 371 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఇందులో 50కి పైగా చైర్మన్‌ పోస్టు కోసం వచ్చాయి. TSPSCలో చైర్మ న్‌ పోస్టుతోపాటు 11 సభ్యుల పోస్టులున్నాయి.

ప్రస్తుతం ఇద్దరు సభ్యులు కొనసాగుతున్నారు. ఇందులో ఒక సభ్యురాలు రాజీనామా చేసినా ఇంకా గవర్నర్‌ ఆమోదించలేదు. మరో సభ్యురాలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. దాంతో మొత్తం 11 పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం 9 సభ్యుల పోస్టు లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories