logo
తెలంగాణ

మూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం

Flood Flow is Increasing in Musi Project
X

మూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం

Highlights

Musi Project: ప్రాజెక్టు 4గేట్లు ఎత్తి నీటి విడుదల

Musi Project: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 4 గేట్లు రెండు ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5వేల866 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 4వేల 595 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా ప్రస్తుత సామర్థ్యం 638.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 2.86 టీఎంసీలుగా కొనసాగుతోంది.

Web TitleFlood Flow is Increasing in Musi Project
Next Story